Tuesday, December 8, 2009

Neela Megha Shyamudu Seetha Ramudu

నీల మేఘశ్యాముడు సీతారాముడు.

పద్మాక్షుడు అను రాజు మహాలక్ష్మిని తన కూతురుగా పొందాలి అని అనుకున్నాడు.
దానికోసరం విష్ణు మూర్తిని గురించి తపస్సు చేసాడు.
పద్మాక్షుని తపస్సుక్కు మెచ్చినశ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమయి నాడు
.పద్మాక్షుని కోరికను నేరవర్చుతానని , ఒక దానిమ్మ పండు ఇచ్చ్చి
అదృశ్యమయినాడు రాజు ఆ పండుని ఇంటికి తీసుకు వెళ్ళినాడు.
దారిలో ఆ పండు పెద్దది అవుతూ వచ్చింది.
భయపడిన పద్మాక్షుడు ఆ పండును పగులకోట్టినాడు.
ఆశ్చర్యం!! దానిలో ఒక పాప వుంది..
అందంగా బొమ్మ మాదిరి వున్న ఆ పాపకు '' పద్మ''అని పేరు పెట్టినాడు.
పాప దిన దిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వచ్చింది.
యుక్త వయసు వచ్చింది. రాజు స్వయంవర ఏర్పాటు చేసాడు.
అనేక దేశ ములనుండి రాజులు ఆ స్వయంవరములో పాల్గొన్నారు.
వారిలో రావణాసురుడు కూడా వున్నాడు.
స్వయంవరమునకు వచ్చిన రాజులు ఎవ్వరూ పద్మాక్షుని కి నచ్చ లేదు.
అప్పుడు పద్మాక్షుడు ''ఎవరయితే ఆకాశంలో వుండే నీలి రంగును
తమ శరీరం కి పూసుకుంటారో వాళ్ళ కి నా కూతురును ఇస్తాను''
అని విచిత్రమయిన ప్రకటన చేశాడు.భలే పోటి.స్వయమ్వరమునకు వచ్చిన
రాజులకు అందరికి కోపం వచ్చింది.పద్మాక్షుడు తన కూతురిని మాకు ఇవ్వడం ఇష్టం లేక
ఈ విధముగా ప్రకటన చేసాడు .రాజులందరూ మాకు మీ అమ్మాయిని ఇవ్వకూడదు అన్న వుద్దేశ్యం తో ఈ విధంగా
ప్రకటన ఇచ్చారు. ఇది కాకుండా , విలు విద్య ,బాణ విద్య ,బుద్ధి కుశలత , వీటిలో పరీక్షలు పెట్టండి.
వాటిలో మేము గెలిచి చూపిస్తాము. అన్నారు. కాని పద్మాక్షుడు
ఒప్పుకోలేదు అందరూ పరి పరి విధములు చెప్పి ప్రయత్నించారు కాని పద్మాక్షుడు ఒప్పుకోలేదు.
అది చూసి అక్కడ వున్న రాజులకందరికి విపరీతమయిన కోపం వచ్చింది.
అందరూ అంతఃపురములో దూరి కొల్లకోట్టారు. అప్పుడు వారి బారి నుండి
తప్పిచుకోవడానికి పద్మ అక్కడ వున్న అగ్ని గుండంలో దూరింది.
పద్మాక్షుడిని గెలిచిన రాజులు పద్మను వెతికినారు. కాని ఆమె ఎక్కడ కనపడలేదు.
విసిగిన రాజులు తిరిగి వెళ్లి పోయినారు.
ఈ సంఘటన జరిగి చాల సంవత్సరములుఅయిన తర్వాత అగ్ని గుండం లో నుంచి పద్మ బయటకు వచ్చింది.
అప్పుడు తాను పెరిగిన రాజ అంతఃపురము మట్టిలో కలసి పోయినది చూసి చాల కష్టపడినది.
అప్పుడు తన వాళ్ళకు ఏర్పడిన కష్టానికి పరిహారంగాశ్రీ మహా విష్ణువు గురించి తపస్సు చేయ ఆరంభించింది.
ఆ సమయంలో ఆకాశ మార్గమున వెళ్తున్న రావణుడు పద్మను చూశాడు.
రావణుడు పద్మ దగ్గరకు వచ్చి తనను వివాహ మాడమని కోరినాడు. ఆమె ఒప్పుకోలేదు.
అపుడామెను బలవంతముగా పిలుచుకు వెళ్లడానికి ప్రయత్నము చేశాడు
మరల తనను కాపాడుకొనుటకై పద్మ అగ్ని ప్రవేశం చేసింది
ఎలాగయినా సరే ఆమెను పొందాలి అన్న భావంతో, ఆమె అగ్ని ప్రవేశం చేసిన అగ్నిని
నీళ్ళు పోసి ఆర్పి వేసి ,. అక్కడి మట్టిని పెళ్ళగించి చూసాడు. అక్కడ నవరత్నములు
మాత్రం దొరికింది. వానిని ఒక పెట్టెలో పెట్టి అంతఃపురములోని పూజ గదిలో వుంచాడు.
కొంత కాలం గడచింది. ఒక రోజు ఆయన ఆ పెట్టెను తెరచి చూసాడు .
మళ్ళి ఆశ్చర్యం! ! ! ! అందులోవున్న పద్మ చిన్న పాప రూపంలో దోగాడుతూ వచ్చింది.
అప్పుడా పాప రావణునితో " రావణా , అనీతిగా , అధర్మంగా రాజ్యమేలుతున్నావు
నిన్ను నశింప చేయక వదలను.కాచుకొని వుండు. వినాశ కాలం చాల దగ్గరలో వుంది;''
అని శాపం ఇచ్చింది. ఆగ్రహించిన రావణుడు ఆ పాపను అప్పుడే చంపుటకు ప్రయత్నించాడు.
కాని , రాణి మండోదరి ఆ పాపను ఎక్కడయినా వదలి రమ్మని వేడుకుంది.
సరేనన్న రావణుడు ఆ పాపను అ పెట్టె లోనే పెట్టే చాల దూరము తీసుకువెళ్ళి, ఎక్కడయినా
నేలలో పాతి పెట్టి రమ్మన్నాడు. ఆ పెట్టెను రాజ సిబ్బంది మిధిలాపురి అన్న చోట
పాతి పెట్టి వచ్చారు.
మిధిలాపురి రాజు జనకుడు. ఆయన ఒక యజ్ఞం చేస్తూ బంగారు నాగలి తో ,
యజ్ఞ కార్యముగా పొలము దున్నుచుండెను.అప్పుడు నాగలికి ఒక పెట్టె తగిలింది.
రావణుని చేత పాతి పెట్ట బడిన పెట్టె అది. ఆ పెట్టెలో దొరికిన పాపను జనకుడు పెంచుకున్నాడు.
ఆ పాపకు '' సీత'' అని పేరుపెట్టుకున్నాడు. యుక్త వయసు తర్వాత ,
జనకుడు ఆ సీతను నీల మేఘ శ్యాముడయిన రాముడికి ఇచ్చి వివాహం చేసాడు.
రావణుడు సీత శాపం వల్ల అంతం లో రాముని చేతిలో మరణించాడు.
ఆ నీల మేఘ శ్యాముడే శ్రీరాముడు. సీతారాముడు.

No comments:

Post a Comment