Tuesday, December 29, 2009

చాదు బొట్టు - చుక్క నీరు.

చాదు బొట్టు - చుక్క నీరు.

మాది చాల చిన్న గ్రామం. అంద్ర్హ్ర లో నెల్లూరు ప్రక్కన గ్రామం . నాకు ఒకటిన్నర వయసునుండి , నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను. మా అమ్మమ్మ వాళ్ళది ఉమ్మడి కుటుంబంగా ఉండి, మగ వాళ్ళ పనుల దృష్ట్యా వేరు వేరు ఊర్లలో వున్నారు. మూడు మైళ్ళ దూరం లో మా పెద్ద తాతగారి ఇల్లు ఉంది. వాళ్ళకి కొంచెం పొలం కూడా ఉంది. మేము అక్కడికి, వాళ్ళు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాము. మా పెద్ద అవ్వ పేరు సీతమ్మ.ఆమె భలే కధలు చెప్పేది.
ఒక పులుసులో బద్ద కధ ఇంకా మాకు జ్ఞాపకం ఉంది. తలచుకుకంటే ఏమిటో పిచ్చిగా నవ్వు వస్తుంది. ఒకసారి మా పెద్దవ్వ, మనుమడు , మనుమరాలు రాజ. ముగ్గురూ వచ్చి రెండు రోజుల తర్వాత తిరిగి బయలు దేరుతున్నారు. అప్పుడు నేను మా అవ్వ కూడా అక్కడికి వెళ్లి రెండు రోజులు వుండి వస్తామని వాళ్ళతో పాటు బయలుదేరాము.
మాకు పెరటి లో ఒక బావి వుంది. వాకిట్లో ఒక బావి వుంది. వాకిటి బావిలో కొంచెం నీరు తక్కువ లోతు వుంటుంది. బయటి వాళ్ళు కూడా వాడుతారు కాబట్టి ఒక చేద ఎప్పుడూ బావి పక్కనే వుంటుంది. తలుపులు తాళం వేసిన తర్వాత అమ్మాయీ బొట్టు ఎందుకు పెట్టుకోలేదే. అని అడిగింది.పెద్దవ్వ. అవ్వా చిన్నదిగా వుంది అవ్వాఅని బదులు చెప్పింది.
కంటికి కనపడకుండా నా ? వెళ్లి చాదు తీసుకుని పెద్దది పెట్టుకురా. అంది . సరి, అని తాళం తీసి, చాదు తీసుకుని వస్తే ఎండి పోయి వుంది.
ఇప్పటి మాదిరి stickerlu కాదు కదా? అచ్చం సబ్బుబియ్యం మాడ్చి, నీళ్ళు పోసి కాచి ,టెంకాయ చిప్ప లో పోసిందాయే.బాగా ఎండి పోయి వుంది. దానిలో రెండు చుక్కలు నీళ్ళు పోసి వేలితో చాదాలి. ఊరికి వెళ్తున్నాము కాబట్టి
అన్ని పాత్రలుబోర్లించి పెట్టేసాము. కావలిసిన రెండు చుక్కల నీళ్ళు లేవు. ఇంతలో రాజమ్మ అవ్వా నీళ్ళు నేను తెస్తాను అంటూ గబా గబా పరుగెతుకుని వెళ్లి చేద బావిలో వేసింది. ఆ వేసిన స్పీడుకు ఆ అమ్మాయి కూడా బావిలో పడి పోయింది. కింద నీళ్ళలో పడ్డ రాజ దర్జాగా ఒక్క మునక వేసి , ఎదురు ఒరకు కాళ్ళు తన్ని స్తిమతంగా కూర్చుంది. బావిలో. రెండో మునక వేయలేదు. ఒక్క క్షణం పైన వున్న ఎవరికీ కాళ్ళు చేతులూ, ఆడలేదు. తేరుకుని, అందరూ కేకలు పెట్టేసరికి ,వీధిలో వెళ్తున్నవారూ, బయట కూర్చున్నవారూ అందరూ వచ్చి, చాంతాడు ఒకటి వేసి పైకి తీసుకు వచ్చారు. ఎంత ధైర్యం గ వుంది రాజ .బయట వున్న మాకు కాళ్ళు చేతులు చల్లగా పోతున్నాయి. పెద్దవ్వకు నోట మాట రాలేదు. అట్టేనిలచి పోయింది.

చిన్నవ్వ ఈ లోపల రాముడి కి 108 టెంకాయలు కొట్టేస్తాను అని మొక్కుకునేసింది. ఎందుకంటే వూళ్ళో వాళ్ళ పిల్లకు ఎమన్నా అయితే బదులు చెప్పాలి కదా? ఇదీ ఆమె కష్టం. నేను , శివరాము బిక్క ముఖాలు వేసుకుని చూస్తున్నాము. మా ప్రయాణం రెండు రోజులు వాయదా పడింది. ఈ సంఘటన జరిగి 40 సంవత్సరములు దాటింది.
తలచుకుంటే ఒక్కొక్క సారి భయం వేస్తుంది. ఆ సమయం లో దేవుడు మన పక్కన వున్నాడు కాబట్టి సరిపోయింది. ఎందుకు ఆ సంఘటన జరిగింది . ఏదో మంచికే జరిగి ఉంటుంది బొట్టు పెట్టుకోవడానికి ఒక రెండు చుక్కలు నీటికోసం జరిగన సంఘటన.

తరువాత ఆ సంఘటనను నవ్వుతూ తలంచు కుంటున్నాము.

No comments:

Post a Comment