అమ్మ పెట్టేది పెట్టాలి.
కేకయ దేశపు రాజుకు , జంతువులు పురుగులు, పక్షులు
మాట్లాడే భాషలు అర్థమవుతుంది. శామిక మహర్షి నుండి
ఈ వరమును పొందిన రాజు , పక్షులు,మృగముల
సంభాషణ ను విని బయట గనుక చెబితే రాజు తల
వేయి ముక్కలు అవుతుంది అన్న జాగ్రత్త కూడా చెప్పి వున్నారు.
ఈ రాజు భార్య కేకయి. దశరధుని భార్య కైకేయి తల్లి.
ఒక రోజు రాజు రాణి అంతఃపుర తోటలో కూర్చుని
మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అక్కడ ఒక చీమ ఒక బియ్యపు గింజను
తీసుకు వెళ్తూ వుంది. ఎదురుగా వచ్చిన ఒక చీమ , స్నేహితుడా !
నాకు చాల ఆకలిగా వుంది నాకు ఆ బియ్యపు గింజను ఇస్తావా? అని అడిగింది.
దానికి ఆ చీమ ఉచ్చ కులస్తుడవయిన నీవు హీన కులస్తుడయిన నా వద్ద
నుండి ఆహారము గ్రహించ కూడదు. అన్నది. ఆ సంభాషణ విన్న రాజు
చీమలకు కూడా కుల భేదాలు ఉన్నాయా అని పెద్దగా నవ్వాడు.
ప్రక్కన వున్న రాణికి ఆ నవ్వు వింతగా తోచి ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది.
రాజుకు వెంటనే శామిక మహర్షి చెప్పిన మాటలు గురుతుకు వచ్చి మాట మార్చాడు.
కాని రాణి వదల లేదు. రాణి మొండి పట్టు పట్టింది. రాజుకు ఏమి చేయాలి తోచ లేదు.
రాజు విధి లేక నేను గనుక చెపితే నా తల వేయి ముక్కలు అవుతుంది అని చెప్పాడు. కాని
రాణి నమ్మ లేదు. రాజు కు ఏమి చేయాలి తోచ లేదు. సుదీర్ఘ ఆలోచన తర్వాత రాణి తోటి ,
నేను కారణం చెపితే , నాకు మరణం సంభవిస్తుంది. అని చెప్పిన కూడా వినలేదు.
కాశిలో మరణం ముక్తిని ఇస్తుంది కాబట్టి అక్కడ చెపుతాను.అక్కడ మరణం సంభవిస్తే
నాకు ముక్తి అయినా దొరకుతుంది అని కాశి కి బయలుదేరినారు రాజు రాణి.
కాశికి వెళ్ళిన తర్వాత రాణి మరల నవ్వుకు కారణం అడిగింది. రాజు నొచ్చుకుంటూ
మూడు దినములు గడవు అడిగినాడు.తన విధిని గూర్చి చింతిస్తూ బయట వాహ్వాళికి
బయలుదేరినాడు.వెళ్తూ దారిలో రెండు మేకలు మాట్లాడుకోవడం విన్నాడు.
వానిలో ఆడుమేక మగ మేక తో అదిగో ఆ భావి పైన వుండే గడ్డి తెచ్చి ఇవ్వు . అలా ఇవ్వకపోతే
నేను నిన్ను వదలి వెళ్ళిపోతాను అని బెదిరించింది. అది విని కోపం తో మగ మేక ఎంత
పొగరు నీకు. .ఆ నీరు లేని భావిలో నేను గనుక పడ్డానంటే నా గతి ఏమవుతుంది.
అంటూ ఆడు మేకను ముట్టి కిందకు తోసివేసింది. తన తప్పు తెలుసుకున్న ఆడు మేక
మగమేకను మన్నింపు అడిగింది. అదివిన్న రాజు తన కర్తవ్యం గురుతుకు వచ్చింది.
నేరుగా ఇంటికి వెళ్లి , బెత్తం తీసుకుని రాణి మీదకు విసరుతూ రహస్యం అడుగుతావా?
రహస్యం అడిగావంటే చంపెస్తాను అంటూ కొట్టడం ప్రారంభించాడు. రాణి భయపడి
ప్రభూ ఈ దినం నుండి ఆ రహస్యం నాకు చెప్పవద్దు. ఏదీ మిమ్మల్ని అడగను . నన్ను
మన్నించండి. కొట్టడం ఆపండి అని ప్రాధేయపడింది .
రాజు రాణి కాశీ నుండి రాజ్యానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు రాజు చాల స్థిమిత
పడ్డాడు. మనసు ప్రశాంతం గ వుంది.
మన మనస్సు కు పిడివాదం పట్టే గుణం వుంది. ఆ మొండి పట్టుదల వల్ల
చాల సార్లు మనం చాల నష్ట పోతాము.అల కాకుండా మనసు మొండి పట్టుదల గ వున్నప్పుడు
మనకు మనమే కట్టుబాట్లు విధించుకొని , ఆ మొండి తనం నుంచి బయట రావాలి.
అలా వస్తేనే మన మనస్సును మన కట్టుబాటులో వుంచుకొని కష్టాలనుండి బయట పడవచ్చు
ఈ కథ లో కేకయ రాజు అలాగే మనశ్శాంతి ని పొందాడు. .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment