Tuesday, December 29, 2009

నమస్కారమండి శేషయ్యగారూ,

కొన్ని సంఘటనలను జీవత కాలంలో మరచి పోలేము.
మేము madras లో mount road సెంటర్ లో ఒక ఇంట్లో వుండే వాళ్లము.
అది ఇల్లు అని చెప్పేదానికంటే ఒక చిన్న చర్చి లాంటి ఒక పెద్ద బంగ్లా.
బ్రిటిష్ వాళ్ళ period లో కట్టినటువంటి , శిల్పుల ఇల్లు. అది మాకు 1953 లో
ఇల్లుగా దొరికింది. రాత్రి పూట ఆ ఇంట్లో నడవ్వాలి అంటేనే మాకు
భయంగా వుండేది. అప్పుడు నేను మా అక్కయ్య , మా తమ్ముడు ,
మా చెల్లెలు వుండే వారము. చెల్లెలు 1సం. పాప. తమ్ముడు 4 సం.ల వాడు.
నాకు 7 సం మాఅ క్కయ్యకు 10 సం .
ఆ ఇంటి వెనుక పెద్ద వేప చెట్టు వుండేది. పగులు చూస్తేనే మాకు చాల భయం గా
వుండేది. మధ్య రాత్రి వేళలో మేము బాత్రూం వెళ్ళాలంటే ఒకరినొకరు
తోడుకు లేపుకొనే వాళ్ళం. లేచి బయట తలుపు వరకు రావాలి అంటే కనీసం 15 అడుగులు
నడవవలసి ఉంటుంది . బయట వచ్చిన తర్వాత కూడా ఒక 10 అడుగులు నడవ్వాలి.
ఒక రోజు రాత్రి రెండూ - రెండున్నర మధ్యలో ఒకరినొకరు లేపుకొని నేను మా అక్కయ్య
ఇద్దరమూ మెల్లిగా బయటకు వచ్చాము. పది అడుగుల వరండా లో నడుస్తున్నాము..
ఇంతలో మాకు వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది

నమస్కారమండి శేషయ్య గారూ అని మా అక్కయ్యకు
శేషయ్యగారూ బాగున్నారా అని నాకు ఒకేసారి వినిపించింది.
అంతే ఇద్దరమూ భయపడి పరుగో పరగు .లోపలి వచ్చేసాము.
ఆ తర్వాత 77 వరకు అదే ఇంట్లో వున్నాము . కాని ఆ విధంగా రాత్రి
పూట బయట వెళ్లలేదు. ఆ సంఘటన మేము మూడో వాళ్లకు కూడా
చెప్పలేకపోయము. కారణం మా ఇద్దరికీ వేరు వేరు పదాలు వినపడింది.
ఇద్దరమూ వాళ్ళ వాళ్లకు వినపడింది కాదు అని చెప్పలేక పోయాము.
ఈ దినం తలచు కున్న కూడా ఒళ్ళు జలబరిస్తుంది భయంతోటి.
ఆ గొంతు ఎవరిదీ. ఎవరు ఒకేసారి రెండు పదాలు మాట్లాడారు.
ఆ వేప చెట్టు మీద ఎవరయినా వున్నారా? ఏమో? ? ? అన్ని ప్రశ్నలే.
ఎప్పుడయినా మేము ఇద్దరమూ వుంటే ఆ విషయం గురించి
మాట్లాడుకొని నవ్వుకుంటాము.

No comments:

Post a Comment